Monday, 21 December 2015

Dictator (2016) Audio Launch Details

నా స్వభావానికి దగ్గరైన పేరు ‘డిక్టేటర్‌’ - బాలకృష్ణ ‘‘డిక్టేటర్‌ అంటే నియంత. ఇది నా స్వభావానికి దగ్గరగా ఉండే పేరు. చైతన్యం, మార్పు కోసం ఒక్కోసారి జులుం ప్రదర్శించక తప్పదు. అప్పుడప్పుడు అత్యవసరం కూడా. ఇదే మా సినిమా నేపథ్యం. ఈ పండగకు మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాన’’న్నారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిక్టేటర్‌’. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష కథానాయికలు. శ్రీవాస్‌ దర్శకుడు. వేదాశ్వ క్రియేషన్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

తమన్‌ స్వరాలందించిన ఈ సినిమా పాటల ఆవిష్కరణ వేడుక ఆదివారం రాత్రి అమరావతిలో జరిగింది. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించారు. నందమూరి బాలకృష్ణ స్వీకరించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు చూపించిన దారిలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ వస్తున్నాను. మీ ఆశీస్సులతోనే ఇది సాధ్యమవుతోంది. నేను కాలం వెంట వెళ్లను. కాలం నా వెంట రావాల్సిందే. నేను దేనికీ తీసిపోను. పదవులు మనకు అలంకారం కాదు.. పదవులకు నేను అలంకారం. శ్రీవాస్‌ ముక్కుసూటిగా ఉండే మనిషి. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం కాబట్టే సినిమా అద్భుతంగా రూపొందించగలిగాం. 

దేశంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీస్తోన్న ఎరోస్‌ ఈ సినిమా చేసినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సోనాల్‌ చౌహాన్‌ తపన ఉన్న నటి. ‘లెజెండ్‌’ సమయంలోనే ఆమె ప్రతిభ తెలిసింది. తెలుగు హీరోయిన్లు కరవవుతున్న రోజుల్లో అంజలి దేవుడిచ్చిన వరప్రసాదం. సందడిగా ఉంటూ అందరిలో హుషారు నింపుతుంది. నా నుంచి ఏమీ ఆశించకుండా అందరూ అభిమానం చూపిస్తున్నారు. అదే నాకు శ్రీరామరక్ష. ఇంతమంది అభిమానులను పొందడం నా అదృష్టం. ఇది పూర్వ జన్మ సుకృతం. మనది విడదీయరాని బంధం. మా నాన్న రోజుల నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వస్తోన్న అభిమానులకు ఎప్పుడూ అండగానే ఉంటా. తమన్‌తో తొలిసారి పని చేశాను. మంచి బాణీలు సమకూర్చారు. ఆయన బాణీల్లోని హుషారు నాలోనూ కనిపించింద’’న్నారు. రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ‘‘ఈ పాటల విడుదల కార్యక్రమం అమరావతిలో జరగడం ఆనందదాయకం. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాన’’న్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ‘‘అమరావతిలో తొలిసారిగా ఆడియో వేడుక జరుపుకుంటున్న ‘డిక్టేటర్‌’ బాక్సాఫీసు దగ్గర చరిత్ర సృష్టించబోతోంది. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నూతన రాజధానికి శుభారంభమ’’న్నారు. సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ‘‘పేదల పాలిట పెన్నిధిగా ఈ ‘డిక్టేటర్‌’ వస్తున్నాడు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో అందరిలో చైతన్యం నింపడానికి బాలకృష్ణ ఈ సినిమా చేశారు. ఇది కచ్చితంగా చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మన రాష్ట్ర నిర్మాణం మలుపు తిరుగుతుంద’’న్నారు. శ్రీవాస్‌ మాట్లాడుతూ ‘‘లౌక్యం’ తర్వాత బాలకృష్ణగారిని కలిశాను. ‘మనం ఒక సినిమా చేద్దాం సర్‌’ అంటే వెంటనే ఓకే చెప్పేశారు. 

ఆయన నా మీద ఉంచిన నమ్మకమది. బాలకృష్ణతో పని చేయడం కష్టం అంటుంటారు. కానీ ఆయనతో పని చేసి చెప్తున్నా.. ఆయనతో పనిచేయడం చాలా సులభం. ఆయన దగ్గర అబద్దం చెప్పినా, నిజం దాచినా నచ్చదు. తన చుట్టుపక్కల వాళ్లూ అలాంటోళ్లు ఉండాలని కోరుకుంటారు. నేను ఆయనలాగే ఉన్నాను. అందుకే ఆయనతో పని చేయడం సులభమైపోయింది. ఈ సినిమాకు తమన్‌ మంచి సంగీతం అందించాడు. ఈ సినిమా చేస్తున్న ప్రతి రోజు నేను ఫ్యాన్స్‌నే గుర్తుకు తెచ్చుకునేవాడిని. సినిమా చూసి అభిమానులు 20 సార్లు పండగ చేసుకుంటారు.  అభిమానులు తలెత్తుకు తిరిగేలా ఈ సినిమా ఉంటుంది. పండగకు అందరూ థియేటర్లకు రండి... మనం పండగ చేసుకుందామ’’న్నారు.తమన్‌ మాట్లాడుతూ ‘‘భైరవద్వీపం’ సినిమాకు మాధవపెద్ది సురేష్‌ గారి దగ్గర పని చేశా. ఆ సినిమాకు పని చేసినందుకు రూ.30 ఇచ్చారు. అలా నా తొలిసంపాదన బాలకృష్ణగారి సినిమాతోనే ప్రారంభమైంది. బాలకృష్ణ 99వ సినిమాకు పనిచేస్తాననని నేను ఎప్పుడూ వూహించలేదు. బాలయ్య ఎనర్జీకి, టెంపోకు సరిపోయేలా సంగీతం అందించడం చాలా కష్టం. మా చిత్రబృందం సహకారంతో ఈ సినిమా చేయగలిగాన’’న్నారు. కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీధర్‌, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, తెనాలి శ్రవణ్‌, జి.వి.ఆంజనేయులు, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, విజయలక్ష్మి, పూర్ణచంద్రరావు, గాంధీ, శివనాగమల్లేశ్వరరావు, ఎరోస్‌ చింటు, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, సాయి కొర్రపాటి, రామజోగయ్య శాస్త్రి, శ్యామ్‌ కె.నాయుడు, బెనర్జీ, బ్రహ్మ కడలి, అంబికా కృష్ణ, శ్రీధర్‌ సీపాన, గోపీమోహన్‌, కోన వెంకట్‌, రత్నం, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన బాలకృష్ణ డైలాగులు 
‘‘పర్వతం ఎక్కు ఫర్వాలేదు. ఎత్తాలని చూడకు పైకిపోతావ్‌’’, ‘‘నా పేరు ధర్మ. నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్‌. నీ చావు చూడాలంటే దాన్ని టచ్‌ చేసి చూడు..’’, ‘‘మీరు ఏం చేసినా పబ్లిసిటీ చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీ అవుతుంది’’ అంటూ తనదైన శైలిలో డైలాగ్‌లు చెప్పి బాలకృష్ణ అలరించారు. ‘‘దాహం వేస్తే సింహం కూడా తలదించుకొని నీళ్లు తాగుతుంది. అంతమాత్రానికి తల దించుకుందని తొడగొట్టకు. తర్వాత కొట్టడానికి తొడ ఉండదు. ఎత్తడానికి తల ఉండదు’’ ఈ డైలాగ్‌ను ఓ అభిమాని పంపించాడు. నా డైలాగ్‌లు విని స్ఫూర్తి పొంది ఇలా రాసి పంపించాడు. ఆ డైలాగ్‌నే సినిమాలో వాడామని చెప్పారు బాలకృష్ణ.


*************************************************************
My name is imminent nature of the 'dictator'
- Balakrishna

'' What the dictator to dictator. The name of my character, which is close to. Mobility, will be demonstrating for change, sometimes oppression. Even the occasional emergency. This is the theme of our film. Vastunnam your forward on this occasion. All adaristarani Balakrishna asistunnanannaru. The film, starring his hero 'dictator'. Anjali's, Sonal Chauhan, axial heroes and heroines. Srivas director. Vedasva creations, to jointly build and Eros International. Taman svaralandincina Amravati on Sunday night was the celebration of the discovery of the songs in this film. Rayapati MP Rao unveiled the first CD. Balakrishna received. He said Balakrishna '' My father has been shown to keep showing the diversity of the way, from time to time. It's possible your asissulatone. As long as I go along. As long as I come along. I resolved anything. .. I do not decorate, we decorate the ranks of positions. Srivas a straight man. Because of the film's awesome rupondincagaligam alocistam having identical. Eros napping number of successful films in the country, thanks to my teliyajesukuntunnanu making this film. The actress Sonal Chauhan quest. 'Legend' at the time it was her talent. Telugu heroine Anjali given karavavutunna varaprasadam days. Husaru been bustling fills the lot. All I expected nothing from the show affection. Sriramaraksa the same to me. My good luck getting that many fans. It sukrtam pre-birth. Ours is inseparable bond. Adaristu us back to the days of my father always'm arriving fans. Taman worked for the first time. Was a good score. He husaru banilloni kanipincindannaru houses. Rayapati Rao said, '' released this album is a pleasure to be in Amravati. Asistunnanannaru to receive this film a success. Prattipati pullaravu Andhra Pradesh Agriculture Minister said, '' For the first time in Amravati Audio is celebrating the 'dictator' to create history at the box office. The event was held here subharambhamannaru new capital. Kisorbabu ravela Social Welfare Minister said '' poor polycarbonate Pennidhi this 'dictator' is coming. Balakrishna, this time to rejuvenate the condition of the lot have been in this movie. It is certainly a history-making film. Next, we turn to the structure of the program tirugutundannaru. Speaking srivas' 'laukyam' balakrsnagarini met later. "Sir, we do a movie, 'What would be okay soon. He was placed on my nammakamadi. Balakrishna should not be difficult to work with. But working with him and working with him is very easy saying ... He lied, does not want to hide the truth. Alantollu his neighbors would like to be. I'm not alone. So sulabhamaipoyindi to work with him. Taman good music for this film. Teccukunevadini I remember every day that fans of the film. Festival fans have seen the film 20 times. Fans of the film will turn arises. All theaters on occasion of the holiday to come ... we talking cesukundamannarutaman '' bhairavadvipam 'were working at the film's madhavapeddi Suresh. Rs 30 was making the film work. Thus began my tolisampadana balakrsnagari movie. Balakrishna's 99th film I've ever serendipity panicestananani. The recent Energy, tempoku it very difficult to fit the music. In collaboration with our citrabrndam ceyagaliganannaru this film. Kommalapati program director, modugula Venugopal Reddy, TENALI S, jivianjaneyulu, Anjali, Sonal Chauhan, Vijaya Lakshmi, purnacandraravu, Gandhi, sivanagamallesvararavu, Eros cintu, Ram Achanta, Anil Sunkara, Gopichand Achanta, Sai Korrapati, Ramajogayya Sastry, Shyam K. nayudu, Banerjee, Brahma maritime, Ambika Krishna, Sridhar sipana, gopimohan, Kona Venkat Ratnam, Raghu Babu and others were present.
Balakrishna catering for dialogue

'' May be partly the mountain. Paikipotav the height of the blind '', '' the law of my name. Where the dictator who nursed my ego. Look at your death to touch it to see .. '', '' you're going to do publicity. What is despite the publicity, '' he said in his own style dialogs enthralled Balakrishna. '' If a lion is also Thought thirst sip of water. Todagottaku dincukundani antamatraniki head. Will not strike after thigh. Will not have to raise the head, '' a fan sent this dialogue. Inspired wrote and sent me to hear the dialogue. Balakrishna said that vadamani dialogue in the film.

No comments:

Post a Comment