Friday, 18 December 2015

ఒక్క పాట మినహా డిక్టేటర్‌ షూటింగ్‌ పూర్తి - Dictator Shooting part is complete except for 1 song

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ 99వ సినిమా డిక్టేటర్‌ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర దర్శకుడు శ్రీవాస్‌ వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒకే ఒక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. చిత్ర నిర్మాణం పూర్తవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఆడియో విడుదలకి భారీ ఏర్పాట్లు 
డిక్టేటర్‌ ఆడియో విడుదల కార్యక్రమానికి అమరావతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి బాలయ్య హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ నుంచి ఆడియో విడుదల కార్యక్రమం వరకు 99 కార్లతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నెల 20న ఈ ఆడియో విడుదల కార్యక్రమం జరుగనుంది.

No comments:

Post a Comment