Wednesday, 23 December 2015

Mumaith Khan in Balakrishna's Dictator

ముమైత్‌తో ‘టింగొ టింగొ’ 


ముమైత్‌ఖాన్‌... వెండి తెరపై ఈ ఐటెమ్‌ భామ విజృంభణ చూసి చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు ప్రత్యేక గీతాలకు చిరునామాగా నిలిచిన ముమైత్‌ ఈమధ్య సందడి చేయట్లేదు. చాలా కాలం తరవాత ఆమెకు ఓ సూపర్‌ ఛాన్స్‌ దక్కింది. అదీ నందమూరి బాలకృష్ణ సినిమాతో. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డిక్టేటర్‌’. శ్రీవాస్‌ దర్శకుడు. ఈ చిత్రంలో ‘టింగొ టింగొ’ అనే ఓ ప్రత్యేక గీతం ఉంది. ఆ పాట కోసం ముమైత్‌ఖాన్‌ని ఎంచుకొన్నారు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో బాలకృష్ణ - ముమైత్‌ఖాన్‌ల మధ్య ఈ పాటని తెరకెక్కిస్తారు. దాంతో చిత్రీకరణ పూర్తయినట్టే. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. సంక్రాంతికి ‘డిక్టేటర్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


*******************************

Mumaitto 'tingo tingo'


She saw the boom of this item mumaitkhan ... been a long time on the silver screen. Special songs address the recent hubbub mumait doing it once stood. After a long time she was given a super chance. That film Balakrishna. He's the hero of the film 'dictator'. Srivas director. The film 'tingo tingo', a special song. The song chosen for the mumaitkhanni. Bala Hyderabad from Wednesday - the middle of the song's upcoming mumaitkhanla. Purtayinatte the shooting. Music provided by the recently released songs. Sankranthi 'diktetarni the audience is brought forward.

No comments:

Post a Comment